Magazines

సీపీ ప్లస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రణ్‌వీర్‌ సింగ్‌

2 గంటల క్రితం

Ranveer Singh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : భారతదేశంలో ప్రముఖ సెక్యూరిటీ, నిఘా సాంకేతిక పరిజ్ఞాన సంస్థ సీపీ ప్లస్‌, తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించింది. విశ్వాసం, ఆవిష్కరణలు, భద్రతపై నమ్మకం అనే ఉమ్మడి లక్ష్యాలతో ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. ఇళ్లు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను అందిస్తున్న సీపీ ప్లస్‌, ఈ భాగస్వామ్యం ద్వారా స్మార్ట్‌ సెక్యూరిటీపై మరింత అవగాహన కల్పించనుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో వీడియో సెక్యూరిటీ ఉత్పత్తుల తయారీ పరంగా దేశంలోనే అతిపెద్ద సమీకృత తయారీ కేంద్రాల్లో ఒకదాన్ని సీపీ ప్లస్‌ నిర్వహిస్తోంది. ఎస్‌టీక్యూసీ (STQC) ధ్రువీకరణ పొందిన పరిష్కారాల విస్తృత శ్రేణిని సంస్థ అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాలకు కట్టుబడి పనిచేస్తున్న సంస్థ, దేశంలోని విశ్వసనీయ సాంకేతిక బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది.

ఈ భాగస్వామ్యంపై రణ్‌వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశపు భద్రతా రంగంలో నిత్యం కొత్త ప్రమాణాలను సీపీ ప్లస్‌  నెలకొల్పుతోంది. ఆ సంస్థకు ప్రచారకర్త  కావడం సంతోషంగా ఉంది. సురక్షితమైన ఇళ్లు, కార్యాలయాలు, సమాజాల నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారుతోంది. భారత్‌ కోసం రూపొందించిన వినూత్న పరిష్కారాలతో సీపీ ప్లస్‌ ఈ రంగంలో ముందుంది. భద్రతపై భారతీయుల ఆలోచనా విధానాన్ని మార్చే సంస్థలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

సీపీ ప్లస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదిత్య ఖేమ్కా మాట్లాడుతూ, ‘‘నమ్మకమైన ఆవిష్కరణల ద్వారా సురక్షితమైన, స్మార్ట్‌ భారతదేశాన్ని నిర్మించడమే మా ప్రయాణ లక్ష్యం. మనకు అత్యంత ముఖ్యమైన వాటిని కాపాడటంలో స్మార్ట్‌ సెక్యూరిటీ పోషించే పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడం అవసరం. దీనికోసం, రణ్‌వీర్‌ సింగ్‌ను సీపీ ప్లస్‌ కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి దేశంలోని ప్రతి ప్రాంతానికీ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన స్మార్ట్‌ భద్రతా పరిష్కారాల సందేశాన్ని చేరవేయాలని భావిస్తున్నాం’’ అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్