Magazines

థ్రిల్‌ చేసే ‘అ’.

1 గంట క్రితం

Thrilling
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'అ'. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మొదట ఈనెల 30న థియేట్రికల్‌ చేయాలనుకున్నారు. అయితే ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ కానీ మేకర్స్ నవంబరు 12న ఘనంగా విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయించారు. ఈ సందర్భంగా మేకర్స్‌ విడుదల తేదీ కోసం రిలీజ్‌ చేసిన కాన్సెప్ట్‌ వీడియో సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ మిస్టిరీయస్‌ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్‌ ను కనకరావు తొనంగి, అభిషేక్ కె, ఎడిటర్ గ్యారీ బీహెచ్‌ నిర్మిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ,‘టైటిల్‌ చుట్టు ఉన్న అమ్మాయి.. అదృశ్యం.. అన్వేషణ, అను మానం.. అసాంఘీకం... అమానుషం ఈ పదాల మధ్యే ఈ కథ మొత్తం ఉంది. ఓ సరికొత్త కథతో మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. ‘విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే విధంగా రూపొందిన చిత్రమిది. రాహుల్‌ విజయ్‌ కెరీర్‌లో ఈ సినిమా మైల్‌ స్టోన్‌గా నిలుస్తుంది. మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా మీ అందరికి థ్రిల్ల్‌ను పంచబోతుంది’ అని నిర్మాతలు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్