Magazines

వాట్సాప్‌లోనే ఉజ్జీవన్ 
ఎస్‌ఎఫ్‌బీ బ్యాంకు ఖాతా

15 నిమిషాల క్రితం

వాట్సాప్ ద్వారా నేరుగా
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : వాట్సాప్ ద్వారా నేరుగా సేవింగ్స్ ఖాతా తెరిచే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. ఆధార్, పాన్ ధ్రువీకరణ, వీడియో కేవైసీ పూర్తి చేయడం ద్వారా ఖాతా తెరవచ్చని పేర్కొంది. ప్రత్యేక యాప్ డౌన్‌లోడ్ అవసరం లేదని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం 15 లక్షల మందికి పైగా వినియోగదారులు వాట్సాప్ ద్వారా 50కి పైగా సేవలు పొందుతున్నారని, మొత్తం సర్వీస్ అభ్యర్థనల్లో 22 శాతం ఈ మాధ్యమం నుంచే వస్తున్నాయని వెల్లడించింది. భవిష్యత్తులో ఏఐ, బహుళ భాషా, వాయిస్ సేవలను విస్తరించనున్నట్లు బ్యాంకు ఇంటర్మ్‌ సీఈఓ కెరోల్ ఫుర్తాదో తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్