Magazines

రూపాయి పతనం

2 గంటల క్రితం

Decline of the Rupee
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

డాలర్‌‌తో పోల్చితే 44 పైసలు క్షీణత

రూ.94.82కు చేరిక

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్ల వరుస పతనం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. గురువారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 44 పైసలు క్షీణించి రూ.94.82కు పరిమితమయ్యింది. ఇంటర్‌బ్యాంక్‌ విదేశీ మారక మార్కెట్‌లో రూ.94.47 వద్ద ప్రారంభమైన రూపాయి ఒక దశలో రూ.94.94 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బుధవారం 53 పైసలు బలపడి రూ.94.38 వద్ద ముగిసిన రూపాయి.. ఒక్కరోజులోనే ఆ లాభాల్లో అధిక భాగాన్ని కోల్పోయింది. మరోవైపు అంతర్జాతీయ ముడిచమురు ధర బ్యారెల్‌కు 112.33 డాలర్లకు చేరడం దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల దిశగా పెరిగితే రూపాయిపై మరింత ఒత్తిడి ఏర్పడే ప్రమాదం ఉందని ఫారెక్స్‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రూపాయి బలహీనపడితే భారత్‌ చమురు దిగుమతుల బిల్లు పెరగడంతో పాటు, దిగుమతి చేసుకునే ముడి పదార్థాలు, ఎలక్ట్రానిక్స్‌, ఇతర వస్తువుల వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది దేశీయ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపనుందని విశ్లేషిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్