Magazines

క్రిప్టో ఆస్తులతో ఆర్థిక ముప్పు: 
ఆర్‌బీఐ గవర్నర్

56 నిమిషాల క్రితం

Financial risk from crypto assets: RBI Governor
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

ముంబయి : బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నప్పటికీ భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు క్రిప్టో ఆస్తులు ముప్పుగా మారే అవకాశం ఉందని ఆర్‌‌బి గవర్నర్‌ ‌సంజయ్‌ ‌మల్హోత్ర హెచ్చరించారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్‌లో మల్హోత్రా మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, భౌగోళిక రాజకీయ పరిణామాలు, సైబర్‌ దాడులు లేదా సాంకేతిక వైఫల్యాలు కూడా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉన్నందున ఆర్థిక స్థిరత్వ పరిధిని మరింత విస్తరించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఆర్థిక స్థిరత్వం భవిష్యత్తులోనూ రక్షణ కవచంగా ఉంటుందన్న హామీ లేదని పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో ఒత్తిళ్లు తక్కువ సమయంలోనే పేరుకుపోయే అవకాశం ఉన్నప్పటికీ.. వాటి పరిష్కారానికి మాత్రం సంవత్సరాలు పట్టవచ్చని తెలిపారు. భవిష్యత్ ఆర్థిక సంక్షోభం బ్యాంకింగ్ వ్యవస్థ నుంచే ప్రారంభం కావాల్సిన అవసరం లేదని మల్హోత్రా తెలిపారు. భౌగోళిక రాజకీయ పరిణామాలు, సైబర్‌ దాడులు, సాంకేతిక వైఫల్యాలు కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్