Magazines

శేఖర్‌ మాస్టర్‌ కారుకు ప్రమాదం..!

7 గంటల క్రితం

Accident involving Shekhar Master's car..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నవంబర్ 11 రాత్రి ఓ సినిమా పాట చిత్రీకరణ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి పండ్ల లోడ్‌తో వస్తున్న లారీ ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ శేఖర్ మాస్టర్‌కు ఎలాంటి పెద్ద గాయాలు కాలేదని, ఆయన క్షేమంగా ఉన్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రమాద వార్త తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. శేఖర్ మాస్టర్ క్షేమంగా ఉన్నారన్న సమాచారంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్