నవతెలంగాణ-హైదరాబాద్ : అనంతపురం జిల్లా రాప్తాడు దాడి ఘటనలో నిందితుడు హేమంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని కర్నూలు సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. అనంతపురం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన హేమంత్‌కు కార్డియాలజీ విభాగంలో 4 రోజుల పాటు చికిత్సలు అందించడంతో కోలుకున్నాడని, బుధవారం అతడిని డిశ్ఛార్జ్ చేసి, అనంతపురం జిల్లా జైలు అధికారులకు అప్పగిస్తామని తెలిపారు.
నేడు డిశ్ఛార్జ్ కానున్న రాప్తాడు నిందితుడు
18 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)