Magazines

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నిరసన

10 నిమిషాల క్రితం

Protest
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు సైదులు

నవతెలంగాణ-నెల్లికుదురు 

కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజావేదిక విధానాలకు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ఈసంపల్లి సైదులు తెలిపాడు. గురువారం మండలంలోని మునిగలవీడు గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు పండించిన పంటకు గిట్టుబాటు దర కల్పించాలని. రైతు ఆత్మహత్య కుటుంబాలకు 25లక్షల నష్టపరిహారం చెల్లించాలని, రైతులకు వ్యవసాయ కార్మిక కుటుంబ సభ్యలందరికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చెయాలని, ఉపాధి హమి కూలిలకు 200 రోజుల పని దినాలు రోజుకు రూ.700 కూలి ఇవ్వాలని పేర్కొన్నారు.


పొడుభూములు సాగు చెసుకునే వారికి పట్టాలు ఇవ్వాలని, వారికి బ్యాంకుల ఋణాలు అదించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, రైతులు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. రైతాంగం, కార్మిక వర్గాల హక్కులను కాపాడాలని, ప్రజలపై భారాన్ని పెంచే విధానాలను నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు,బత్తెం సత్యనారాయణ మచ్చ వెంకన్న ఇసంపేల్లి చంద్రయ్య లాలు బండ వెంకన్న గద్దల యాకయ్య ఎలేంద్ర రైతులు, కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్