Magazines

వసతి గృహాల్లో కొనుగోళ్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

14 నిమిషాల క్రితం

abolished
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు

సంక్షేమ వసతి గృహాల్లో అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) విధానాన్ని వెంటనే రద్దు చేయాలి అని ఎస్ఎఫ్ఐ నెల్లికుదురు మండల అధ్యక్షుడు విక్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలిపారు. గురువారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ తహసిల్దార్ శ్రీనాథ్ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించి, విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.


తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్యం, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపాడు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్రీకృత కొనుగోళ్ల విధానంతో విద్యార్థుల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా మారిందని ఆవేదన చేశారు. వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో వసతి గృహాల వార్డెన్లు, స్థానిక అధికారులు అవసరమైన సరుకులను నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం కాంట్రాక్టర్ల చేతుల్లోకి కొనుగోళ్ల వ్యవస్థ వెళ్లడంతో సరుకుల నాణ్యత, ధరలు, సరఫరా విషయంలో అనేక అనుమానాలు వెలువడుతున్నాయి అన్నారు. ప్రతి వసతి గృహానికి నాణ్యమైన సరుకులు సకాలంలో అందేలా ప్రభుత్వం పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. 


సరైన వసతి, మరుగుదొడ్లు, తాగునీరు, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలు లేకుండా విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రతి సంక్షేమ వసతి గృహానికి సొంత భవనాలు నిర్మించి, విద్యార్థులకు గౌరవప్రదమైన వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, లేనిపక్షంలో విద్యార్థులను పెద్ద ఎత్తున సమీకరించి పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ఎస్ఎఫ్ఐ నెల్లికుదురు మండల నాయకులు నవీన్ ,పవన్,వెంకట్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్