Magazines

రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన 

35 నిమిషాల క్రితం

Constitution Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించారు. మాక్ అసెంబ్లీ నిర్వహించి ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసనసభ పనితీరు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాలపై అవగాహన కల్పించి అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, పాఠశాల ఉపాధ్యాయులు మంజులత, కొండ శ్రీనివాస్,మీనా, అమీనా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్