Magazines

సౌదీకి ఎయిర్‌ ఇండియా విమానాలు రద్దు

3 గంటల క్రితం

Air India flights to Saudi Arabia cancelled
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్‌: భద్రతా పరిస్థితుల దృష్ట్యా సౌదీ అరేబియాలోని జెడ్డా, రియాద్‌, దమ్మామ్‌ నగరాలకు విమాన సర్వీసులను నవంబర్‌ 14 వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రకటించాయి. ఈ నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను రద్దు చేశాయి. ప్రభావిత ప్రయాణికులు అదనపు రుసుము లేకుండా టికెట్‌ తేదీని మార్చుకోవచ్చని లేదా పూర్తి రీఫండ్‌ పొందవచ్చని తెలిపాయి. సౌదీలో చిక్కుకున్న భారతీయులు, ఉమ్రా యాత్రికులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్