Magazines

NZ vs IND రెండో టెస్టు.. ముగిసిన తొలి రోజు ఆట

13 నిమిషాల క్రితం

NZ vs IND: First day's play concludes..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్‌–న్యూజిలాండ్ రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. టామ్ బ్లండెల్ (53*), గ్లెన్ ఫిలిప్స్ (36*) క్రీజులో ఉన్నారు. కివీస్ కెప్టెన్ టామ్ లేథమ్ (59) అర్ధసెంచరీ సాధించగా, డేవన్ కాన్వే (31), డారిల్ మిచెల్ (31), హెన్రీ నికోల్స్ (16) రాణించారు. రచిన్ రవీంద్ర డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీయగా, గుర్నూర్ బ్రార్, అన్షుల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. బుమ్రాకు తొలి రోజు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్