Magazines

అమెరికాలో బాంబ్‌ సైక్లోన్‌ బీభత్సం

1 గంట క్రితం

Bomb cyclone hits America

America

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికాలో థ్యాంక్స్‌ గివింగ్‌ డే వేళ బాంబ్‌ సైక్లోన్‌ ప్రభావంతో న్యూయార్క్‌, న్యూజెర్సీ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో వీధులు వరద నీటితో నిండిపోయాయి. సుమారు 9 లక్షల మందికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 420 విమానాలు రద్దు కాగా, 2 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

అట్లాంటిక్‌ తీరంలోని 25 రాష్ట్రాల్లో తుపాను ప్రభావం కనిపిస్తుండగా, సుమారు 25 కోట్ల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేసిస్‌ థ్యాంక్స్‌ గివింగ్‌ పరేడ్‌ వాయిదా పడింది. 24 గంటల్లో వాతావరణ పీడనం అసాధారణంగా పడిపోవడం ద్వారా ఏర్పడే తీవ్ర తుపానును ‘బాంబ్‌ సైక్లోన్‌’గా పిలుస్తారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్