నవతెలంగాణ-హైదరాబాద్: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భాగంగా శ్రీలంక-ఎతో ఇవాళ జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత-ఎ జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (78), కెప్టెన్ తిలక్ వర్మ (53), మిడిలార్డర్ బ్యాటర్ షాబాజ్ అహ్మద్ (54 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (40) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. మిగతా ప్లేయర్లలో కుమార్ కుషాగ్రా 21, రింకూ సింగ్ 12, సూర్యాంశ్ షేడ్గే 10, తనుశ్ కోటియన్ 28, హర్ష్ దూబే 8 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో రవిందు ఫెర్నాండో, జనిత్ లియనాగే, నిపున్ ధనుంజయ తలో 2 వికెట్లు పడగొట్టగా.. గరుక సంకేత్, లహీరు సమరకూన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఆసియా కప్ రైజింగ్: భారత-ఎ జట్టు భారీ స్కోర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)