Magazines

పదో తరగతి విద్యార్థినిపై మిషన్‌తో దాడి

31 అక్టోబర్, 2026

Hemanth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం దారుణం జరిగింది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది చెక్క మొద్దులు కోసే మిషన్‌తో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో గోపిక లక్ష్మి అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి.


పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, నిందితుడి పేరు హేమంత్ అలియాస్ 'దుమ్ము'. దాడి చేసిన అనంతరం అతను పాఠశాల నుండి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత, ధర్మవరం రైల్వే స్టేషన్‌లో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్