నవతెలంగాణ- హైదరాబాద్: దసరా పండుగ వేల హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనమవడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్లో ఫ్లైఓవర్ల నిర్మాణ పనులతో సర్వీసు రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులకు ఇతర మార్గాల్లో మళ్లిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.
దసరా ఎఫెక్ట్.. హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ రద్దీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)