నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం సర్వే సర్ ను వ్యతిరేకిస్తూ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో పార్లమెంట్, జంతర్ మంతర్, సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహించారు.
ఈ తరహా ఆందోళలను ముమ్మరంగా కొనసాగేంచేందుకు, అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి నిరసనలను ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆందోళనలో భాగస్వామ్యమైన ఇండియా బ్లాక్ నేతలను, వివిధ విద్యార్థి సంఘాల నేతలను, పలు సంఘాల నాయకులకు ప్రతిపక్షనేత అధికార నివాసంలో టీ పార్టీ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలియజేశారు.
"ప్రజాస్వామ్యాన్ని రక్షించే పోరాటంలో అందరూ కలిసి ఉన్నారని, ఈ రోజు 'ఇండియా' (INDIA) కూటమి నాయకులు, ప్రతిపక్ష ఎంపీలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులను టీ కోసం నా ఇంటికి ఆహ్వానించాను. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో మేమంతా ఏకతాటిపై ఉన్నాము - ఈ ఉద్యమం అవిశ్రాంతంగా కొనసాగుతుంది," అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.






కామెంట్‌లు (0)