Magazines

ఆర్నబ్ తుఫాన్‌..ఏపీలో 9 మంది మృతి

1 గంట క్రితం

Arnab tufan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఆర్నబ్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులతో ఏపీలో అపార నష్టం జరిగింది. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలగా, మొత్తం 9 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడిలో ద్విచక్ర వాహనంపై చెట్టు పడి ఒకరు, కోనసీమ జిల్లా అంతర్వేదిలో పూరిల్లు కూలి కొల్లు వెంకాయమ్మ(70), గుంటూరు జిల్లా గుడివాడలో మట్టి గోడ కూలి చింతలపూడి దేవాన్(11) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వర్షం కారణంగా సంభవించిన పలు ప్రమాదాల్లో మరణాలు చోటుచేసుకోవడం ప్రజలను విషాదంలోకి నెట్టింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్