జార్ఖండ్ లో ఘోరరోడ్డు ప్రమాదం

51 నిమిషాల క్రితం

accident
avatar
balaji

ప్రచురించబడింది నవం 30, 2026 | 1 నిమిషాల చదవడం

13 మంది మృతి

రామ్ గఢ్ : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తుల స్కార్పియో కారు, ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతు ల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను బీహార్

వాసులుగా గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, ఈ ప్రమాదం రామ్‌గఢ్‌ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో జరిగింది. వారంతా బిహార్‌లోని నలంద జిల్లా జాంగ్రో గ్రామానికి చెందిన 14 మంది స్కార్పియో కారులో రామ్గఢ్లోని ప్రసిద్ధ ఛిన్నమస్తా ఆలయానికి బయల్దేరారు. ఈ క్రమంలో రాంచీ- పట్నా హైవేపై పైన్కీ ప్రాంతంలో వారి వాహనం ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతో స్కార్పియో నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్నవారికి తేరుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఒక్కరే ప్రాణాలతో ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. వాహనం తీవ్రంగా దెబ్బతినడంతో అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు శ్రమించాల్సి వచ్చింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే 13 మంది మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్