బి వెంకట్, తీగల సాగర్, అనగంటి అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి సుమారు నాలుగు వేల మందికి పైగా బయలు దేరారు. ఆదివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్లో బయలుదేరిన కార్మికులకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర కోశాధికారి మూడు శోభనాయక్, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ అభినందనలు తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణ, కార్మిక వ్యతిరేక విధానాల ప్రతిఘటన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిగే ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, ఎం పద్మశ్రీ, పుప్పాల శ్రీకాంత్, కూరపాటి రమేష్, పి.సుధాకర్, సిహెచ్. బాను కిరణ్, మేడ్చల్ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రాథోడ్ సంతోష్, మేడ్చల్ జిల్లా యంగ్ వర్కర్ జిల్లా కన్వీనర్ మణికంఠ హైదరాబాద్ సౌత్, సిద్ధిపేట జిల్లాల నాయకత్వం ఉన్నారు.






కామెంట్లు (0)