మణిపూర్‌లో ఎలుగెత్తిన నిరాశ్రయులు
ఇంఫాల్‌లో భారీ ర్యాలీ
ఇంఫాల్ : మణిపూర్‌లో దాదాపు నాలుగేళ్ల నుంచి సహాయక, పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్న వేలాది మంది నిరాశ్రయులు రాజధాని ఇంఫాల్‌లో ఆదివారం భారీ ర్యాలీ చేపట్టారు. ఒకప్పుడు బీజేపీని విశ్వసించి మద్దతుగా నిలబడిన మైతేయీ తెగకు చెందినవారు ఈ ర్యాలీలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్ని నిరసన తెలపడం గమనార్హం. ‘సంవత్సరాలు గడుస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లోనే ఇంకెన్నాళ్లు? మా ఊళ్లకు ఎప్పుడెళ్తాం’ అని వారు ఆవేదనగా కేంద్ర, రాష్ర్టాల్లోని బిజెపి ప్రభుత్వాలను ప్రశ్నించారు. తమ పునరావాసం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధిష్ట చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. తమ స్వస్థలాల్లో న్యాయమై, గౌరవప్రదమైన పునరావాసం కల్పిం చాలని డిమాండ్ చేశారు.
సుదీర్ఘ హింసాకాండతో నష్టపోయిన విద్యార్థులు, తల్లుల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ ప్యాకేజీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్లకు పైగా కొనసాగుతన్న హింసాకాండతో నిరాశ్రయులైన వేలాది మంది రాజధాని ఇంఫాల్‌లో ఆదివారం భారీ మార్చ్‌ను నిర్వహించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంఫాల్‌లోని కీషంపత్ జంక్షన్ నుండి ప్రారంభమై ఈ మార్చ్ థౌ గ్రౌండ్ వరకు సాగింది. మూడు కిలోమీటర్లకు పైగా సాగిన ఈ మార్చ్‌లో మోరే, చురాచంద్‌పూర్, కాంగ్‌పోక్పి, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్ కాక్చింగ్ జిల్లాలకు చెందిన నిర్వాసితులు తమ పిల్లలు, వృద్ధులతో సహా ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. మణిపూర్ హిం సాకాండలో 306 మంది మృతి చెందగా, వెయికి పైగా గాయపడ్డారు. 49 మంది గల్లంత య్యారు. ఇక వేలాది మంది నిరాశ్రయు లయ్యారు. వీరంతా ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లోనే తలదాచు కుంటున్నారు.






కామెంట్‌లు (0)