నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లరీపై ప్రాసిక్యూషన్ చర్యలకు FSSAI అనుమతి ఇచ్చింది. సంస్థ నీటి నమూనాల్లో నిర్ణీత పరిమితులకు మించి బ్రోమేట్, PAHs ఉన్నట్లు రెండు దశల ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో ఈ చర్యలు చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కేసు ప్రక్రియకు సిద్ధమైంది. ఈ విషయంపై బిస్లరీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. మరోవైపు, ఆశా కన్ఫెక్షనరీకి చెందిన చాక్లెట్ ఫిల్డ్ కుకీల ప్రభావిత బ్యాచ్‌ను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని FSSAI ఆదేశించింది. కుకీల్లో లేబుల్‌పై పేర్కొనని కార్మోసిన్, అనుమతించిన పరిమితికి మించి టార్ట్రాజైన్, అనుమతించని సన్‌సెట్ ఎల్లో రంగులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
బిస్లరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు..
15 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)