నవతెలంగాణ-హైదరాబాద్ : సూడాన్ సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. సోమవారం సాయంత్రం సౌత్ డార్ఫుర్‌లోని నైలా మార్కెట్‌పై సూడాన్ సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా సామాన్య ప్రజలు మరణించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో మరో 113 మంది గాయపడ్డారని సమాచారం. అధికార మార్పిడి, సైనిక విలీనం విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఇరు వర్గాలు పేలుడు డ్రోన్‌లను వినియోగించడంతో సామాన్య ప్రజలు తీవ్రంగా బలవుతున్నారు.
సుడాన్‌లో డ్రోన్ దాడి..100 మందికి పైగా మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)