నవతెలంగాణ-హైదరాబాద్: శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయంలోని అన్నప్రసాద పోటులో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులు తీవ్ర ఆందోళనకు గురై భయంతో పరుగులు తీశారు. సిలిండర్ పేలుడు ధాటికి మంటలు వేగంగా వ్యాపించడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)