Magazines

ముగిసిన తొలి రోజు ఆట..కివీస్ స్కోరు 243/5

28 నిమిషాల క్రితం

newziland
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : న్యూజిలాండ్‌ - భారత్ తొలి టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు ఆట ముగిసింది. ఇవాళ 82 ఓవర్ల ఆట సాగింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. క్రీజ్‌లో హెన్రీ నికోల్స్ (113*), గ్లెన్ ఫిలిప్స్‌ (94*) ఉన్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 173 పరుగులు జోడించారు. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు తీసి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌.. ఆ తర్వాత రెండు సెషన్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీయగలిగింది. దీంతో ఇవాళ దాదాపు కివీస్‌ పైచేయి సాధించింది. ఓపెనర్, కెప్టెన్ టామ్ లేథమ్ (0), డేవన్ కాన్వే (4), డారిల్ మిచెల్ (1), టామ్‌ బ్లండెల్ (5), రచిన్ రవీంద్ర (15) విఫలమయ్యారు. భారత బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా 3.. అన్షుల్ కాంబోజ్, ఆకాశ్‌ దీప్ చెరో వికెట్ తీశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్