Magazines

వాహనదారులకు గుడ్ న్యూస్..పీయూసీ గడువులో మార్పులు

2 గంటల క్రితం

vehils
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ 2026 నవంబర్ 13న వాహనాల కాలుష్య నియంత్రణ (PUC) సర్టిఫికెట్ నిబంధనలను సవరించింది. కొత్త BS-VI వాహనాలకు పీయూసీ గడువును గరిష్టంగా మూడేళ్లకు పెంచారు. పాత వాహనాల కాలుష్యంపై నిఘా పెంచేందుకు పాత మోడల్ వాహనాలకు పరీక్షల గడువును కుదించారు. పాత సర్టిఫికెట్లు గడువు ముగిసే వరకు చెల్లుతాయి. అనంతరం కొత్త నిబంధనలు వర్తిస్తాయి. వాహనదారులు పరివాహన్ పోర్టల్ ద్వారా వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్