నవతెలంగాణ - హైదరాబాద్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు తిరిగి చేపట్టేందుకు తొలుత తాను సిద్ధంగా లేనని రోహిత్ శర్మ వెల్లడించాడు. జట్టు సారథ్య బాధ్యతలు మళ్లీ అప్పగించాలన్న యాజమాన్య ప్రతిపాదనపై సందిగ్ధంలో పడ్డానని తెలిపాడు. ఆకాశ్ అంబానీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన సమయంలో ఈ విషయంపై చర్చ జరిగిందని, నిర్ణయం తీసుకునేందుకు భార్యతోనూ మాట్లాడి కొంత సమయం తీసుకున్నట్లు వివరించాడు.
జట్టులో గత కొన్నేళ్లుగా చోటుచేసుకున్న పరిణామాలు, ఆశించిన ఫలితాలు రాకపోవడం తనను ఆలోచనలో పడేశాయని రోహిత్ పేర్కొన్నాడు. అయితే తాను దశాబ్ద కాలం పాటు నిర్మించిన జట్టును సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యతను గుర్తించి, తిరిగి కెప్టెన్సీ చేపట్టేందుకు అంగీకరించినట్లు తెలిపాడు.
2020లో చివరిసారిగా టైటిల్ గెలిచిన తర్వాత జట్టు ప్రదర్శనపై డ్రెస్సింగ్ రూమ్‌లో అసంతృప్తి ఉండేదని రోహిత్ చెప్పాడు. ఈసారి ట్రోఫీపై ఒత్తిడి పెట్టుకోకుండా ఆటను ఆస్వాదిస్తూ జట్టుగా ముందుకు సాగాలని ఆటగాళ్లకు సూచించినట్లు వెల్లడించాడు.





కామెంట్‌లు (0)