నవతెలంగాణ - కల్లూరు : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తల్లాడ–కల్లూరు మధ్య చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టడంతో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు.క్షతగాత్రులను ఆరు అంబులెన్స్‌లలో కల్లూరులోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రిలో బాధితుల ఆర్తనాదాలతో పరిస్థితి విషాదకరంగా మారింది. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రంజిత్ కుమార్ తెలిపారు.
గ్రీన్ పీల్డ్ హైవే పైన ఆగి ఉన్న లారీని ఢీ ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)