Magazines

విశాఖ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

1 గంట క్రితం

Major fire at HPCL refinery in Visakhapatnam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – విశాఖపట్నం: విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిఫైనరీ ప్రాంగణం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. దీంతో నగరంలో తీవ్ర కలకలం రేగింది.

మంటలు, పొగను చూసిన సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.


సమాచారం అందుకున్న హెచ్‌పీసీఎల్ భద్రతా విభాగం సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. రిఫైనరీలో పేలుడు సంభవించడం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఆస్తి నష్టంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఘటనపై అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్