Magazines

నాల్గో టీ20లో న్యూజిలాండ్ విక్టరీ

5 గంటల క్రితం

fourth T20
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఆక్లాండ్ వేదికగా జరిగిన నాల్గో టీ20లో న్యూజిలాండ్ జట్టు సమిష్టిగా రాణించింది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి విజయం నమోదు చేసింది. టీమిండియాపై 87 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. 259 పరుగుల భారీ లక్షఛేదనలో 9 వికెట్లు కోల్పోయి 172 రన్స్ చేసి పరాజయం పొందింది అయ్యార్ సేన. ఇప్పటికే 3-1తో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కివీస్ నిర్ణత 20 ఓవర్లలకు గాను 7వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది.ఫిలిప్ సెంచరీతో కదంతొక్కాడు. బ్రేస్ వెల్ 65 పరుగులుతో రాణించాడు. అలెన్ 31, మిచెల్ 24 రన్స్ చేసి తొడ్పాటు అందించారు. భారత్ బౌలర్లు మయాంక్ యాదవ్ 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ తీశారు.


ఆ తర్వాత భారీ లక్ష్య చేధనకు దిగిన ఇండియా తడబడింది. భారత్ బ్యాటర్లు అభిషేక్ శర్మ (27), నమన్ దీర్(28), నితిష్ కుమార్ రెడ్డి(21), కెప్టెన్ అయ్యార్(22), తిలక్ వర్మ(35), ప్రిన్స్(18) రాణించారు. సంజు(4), అక్షర్(7) స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు. ఇషాన్, అర్షదీప్ డకౌట్ గా వెనుదిరిగారు. కివీస్ బౌలర్లు డఫీ 4, శాంటర్న్, ఫిషర్ చెరో రెండు వికెట్లు తీశారు. మిలెన్ ఒక వికెట్ తీశాడు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్