నవతెలంగాణ - హైదరాబాద్ : రాప్తాడు జడ్పీ హైస్కూల్లో దాడికి గురైన బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక స్పృహలో ఉందని, వైద్యుల సూచనలకు స్పందిస్తోందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆరోగ్యం ఇలాగే మెరుగుపడితే గురువారం సాయంత్రం వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉందని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఇదే ఘటనలో గాయపడిన మరో బాలిక లక్ష్మి ధైర్యసాహసాలను లోకేశ్ ప్రశంసించారు. స్నేహితురాలిని కాపాడేందుకు ముందుకొచ్చి తాను కూడా గాయపడిందని కొనియాడారు. ఇద్దరు బాలికలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రంపం దాడి ఘటన.. బాలిక స్పృహలోకి వచ్చింది: మంత్రి లోకేశ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)