నవతెలంగాణ - హైదరాబాద్: భారత్‌తో వన్డే సిరీస్‌లో 0-2తో వెనుకబడిన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక పేసర్లు లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్ గాయాల కారణంగా చివరి రెండు వన్డేలకు దూరమయ్యారు. దీంతో మూడో వన్డేకు ముందు ఆ జట్టుకు బౌలింగ్ సమస్యలు ఎదురయ్యాయి. కుడికాలి కండరాల గాయంతో ఫెర్గూసన్ జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. మరోవైపు వెల్లింగ్టన్ వన్డేలో హెల్మెట్‌కు బంతి తగలడంతో టిక్నర్‌కు ఏడు రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అతడూ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వీరిద్దరి స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్టియన్ క్లార్క్‌ను జట్టులోకి తీసుకున్నారు. మరో పేసర్ మాట్ హెన్రీ నాలుగో వన్డే నాటికి కోలుకుంటాడని న్యూజిలాండ్ ఆశిస్తోంది. హెన్రీ, కైల్ జేమీసన్ మూడో వన్డే తర్వాత టెస్టు జట్టుతో చేరాల్సి ఉన్నా.. నాలుగో వన్డే కోసం జట్టుతోనే కొనసాగనున్నారు.
న్యూజిలాండ్‌కు షాక్.. ఇద్దరు కీలక బౌలర్ల దూరం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)