Magazines

సూర్యాపేట జిల్లాలో బాలిక అనుమానాస్పద మృతి

23 అక్టోబర్, 2026

dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు (ఎస్‌) మండలం ఏపూరు బోడతండాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద బాలిక మృతదేహం కాలిన గాయాలతో లభ్యమైంది. గురువారం అర్ధరాత్రి కుమార్తె కోసం వెతుకుతుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి పరారైనట్లు తండ్రి పేర్కొన్నారు. ఇది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలంలో దొరికిన బైక్ ఆధారంగా తండ్రి ఒక యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్