నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ వేదికగా వెస్టిండిస్ తో జరిగిన టీ20 సిరీస్ ను సమం చేసిన టీమిండియా..న్యూజిలాండ్ తోను అదే జోరును చూపించింది. తొలి టీ20లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. చివరలో నమన్ దీర్ 15 బంతుల్లో 42 పరుగులు చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. కివీస్ నిర్ధేశించిన 225 పరుగుల కొండంత టార్గెట్ ను రెండు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా చేధించింది.
తొలుత టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ (New Zealand) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (45), సీఫెర్ట్ (24), గ్లెన్ ఫిలిప్స్ (81 నాటౌట్) సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ భారత్ ముందు కొండంత టార్గెట్ ను ఉంచారు. ఇండియా బౌలర్లు ఆర్షదీప్, యాదవ్, అక్షర్ పటేల్ తలా వికెట్ తీశారు.
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా..ఓపెనింగ్ జోడీ సంజు, అభిషేక్ తమ శైలిలో కీవిస్ బౌలర్లలపై విరుచుకుపడ్డారు. 33 బంతుల్లో 67 పరుగులు సంజు చేయగా, 29 రన్స్ తో అభిషేక్ రాణించారు. ఈ క్రమంలోనే జోష్ లో ఉన్న అభిషేక్ శర్మను మిలెన్ ఔట్ చేశాడు. దీంతో 93 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మూడు ఓవర్ల వ్యవధిలోనే శాంట్నర్ సంజును పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(6), ఇషాన్(1) సింగిల్ డిజిట్ తో నిరాశ పరిచారు. ఇక కెప్టన్ అయ్యర్(42), అక్షర్ పటేల్(24) జతకట్టి ఇన్నింగ్స్ ను నడిపించారు. అక్షర్ ఔట్ కాగా నమన్ దీర్ క్రీజులోకి దిగాడు. చివరి బంతి వరకు అయ్యర్, నమన్ కలిసి ఓటమి అంతరాన్ని తగ్గించారు. ఈ క్రమంలోనే అయ్యర్ పెవిలియన్ చేరాడు. నమన్ ఒంటరీ పోరాటం చేసి రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్ కు విజయాన్ని అందించాడు.






కామెంట్లు (0)