అమెరికాలో తెలుగు యువకుడి మృతి

1 గంట క్రితం

Telugu youth dies in America
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికాలో జరిగిన ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లకు చెందిన కంటిపూడి కేశవ్‌ చౌదరి (27) మృతి చెందాడు. టీడీపీ నేత కంటిపూడి శ్రీనివాస్‌ కుమారుడైన కేశవ్‌, స్నేహితులతో కలిసి జలపాతం సందర్శించేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఎంఎస్‌ పూర్తి చేసి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్