Magazines

భారత నౌకా దళం మరింత శక్తిమంతం

1 గంట క్రితం

The Indian Navy is more powerful
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారత నావికాదళానికి మరింత బలం చేకూరనుంది. 8 అత్యాధునిక కార్వెట్‌ల తయారీకి క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (సీసీఎస్‌) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.40 వేల కోట్లకు పైమాటే. ఈ మేరకు త్వరలోనే గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌-కోల్‌కతా, గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ సంస్థలతో ఒప్పందం జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో కార్వెట్‌ దాదాపు 2000 టన్నుల బరువుంటుంది. అత్యధికంగా గంటకు 30 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్