నవతెలంగాణ - హైదరాబాద్: గ్లోబల్ సమిట్‌లో పాల్గొనే ప్రతినిధులకు లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతినిధుల రిజిస్ట్రేషన్, పాస్‌ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ‘‘రాష్ట్రంలో ప్రముఖ టూరిస్ట్ స్పాట్లను సమిట్‌లో ప్రదర్శించాలి. వాతావరణ మార్పులపై సదస్సులో చర్చ జరిగేలా చూడాలి. నర్సరీ నుంచి ఆక్స్‌ఫర్డ్ వరకు తెలంగాణ ఎడ్యుకేషన్ ప్రతిబింబించేలా చర్చ జరగాలి. నవంబర్ 15 వరకు ఏర్పాట్ల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాలి’’ అని అన్నారు.
గ్లోబల్ సమిట్‌లో టూరిస్ట్ స్పాట్లను ప్రదర్శించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
18 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)