నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ పరిధిలో గురువారం నాడు సెస్నా-152 శిక్షణ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్ అనుష్క బజ్‌పాయ్ (23), ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ కెప్టెన్ ఎం. ప్రశాంత్ కుమార్ (30) తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వారిని వెంటనే లంగర్‌హౌస్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ లో కూలిన శిక్షణ విమానం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)