కృష్ణా, గోదావరి జలాల వాటాలో కట్టుబడి ఉన్నాం: మంత్రి ఉత్తమ్

19 నవంబర్, 2026

Godavari waters
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏ పోరాటానికైనా, త్యాగానికైనా సిద్ధమని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1.8 టీ ఆంధ్రప్రదేశ్ జలదోపిడి యత్నాలను అడ్డుకునేందుకు ఇప్పటికే కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)తో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి తెలిపారు.


నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం పూర్తిస్థాయిలో పోరాడుతున్నామని, ఒక్క చుక్క జలాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాను సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్