నవతెలంగాణ-ఆసిఫాబాద్
విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన తమకు(ఎఫ్ఎంజి), ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్లకు చెల్లించిన విధంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎఫ్ఎంజి ఇంటర్న్ షిప్ డాక్టర్లు జిల్లా ఆస్పత్రి ఎదుట చేస్తున్న నిరసన మూడో రోజు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా వైద్యులు కమల్, చైతన్య, నిఖిల్ లు మాట్లాడుతూ విదేశాల వైద్య విద్య పూర్తి చేసిన తాము ఓపిడీలు, హాస్పిటల్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగాల్లో చేస్తూ 24 గంటల పాటు సేవలు అందిస్తున్నామన్నారు. అయితే కేవలం రోజుకు 166 రూపాయలు మాత్రమే స్టైఫండ్ చెల్లించడం, తమతో పాటు పనిచేస్తున్న ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్లకు నెలకు 29,792 స్టైఫండ్ చెల్లించడం దారుణం అన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ ఈనెల 8వ తేదీ నుండి నిరసన చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతోపాటు, ఐఎంజి వైద్యులతో సమానంగా తమకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంజి వైద్యులు రజిత, ఝాన్సీ పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఎఫ్ఎంజి వైద్యుల నిరసన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)