Magazines

అశ్వారావుపేట స్టేడియాన్ని రాష్ట్రానికే మణిహారంగా తీర్చిదిద్దుతాం

1 గంట క్రితం

kabbdi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

- అండర్‌ - 20 బాలికల కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

నవతెలంగాణ-అశ్వారావుపేట

అశ్వారావుపేట మినీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి రాష్ట్రానికే మణిహారంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

అశ్వారావుపేట మినీ స్టేడియంలో శనివారం రాష్ట్ర స్థాయి అండర్‌ - 20 బాలికల జూనియర్‌ కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. స్టేడియం అభివృద్ధితో స్థానిక క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు లభించడంతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అనుకూలంగా ఉంటుందన్నారు. అనంతరం సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల జట్ల మధ్య కబడ్డీ పోటీని ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, ఐటీడీఏ పీఓ రాహుల్‌, ఎస్పీ రోహిత్‌రాజు, డీఆర్‌డీఏ పీడీ విద్యాలత తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్