Magazines

కొనసాగుతున్న వన్యప్రాణి వారోత్సవాలు 

1 గంట క్రితం

Ongoing Wildlife Week celebrations
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆసిఫాబాద్ 

జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2న ప్రారంభమైన జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు కొనసాగుతున్నాయి. వారోత్సవాలు భాగంగా జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అటవీశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించగా మొత్తం 50 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ వన్యప్రాణి సంరక్షణ వాటి ప్రాధాన్యత తెలియజేయడం కోసం వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయడమే అటవీ శాఖ లక్ష్యం అన్నారు. తాము నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నట్లు వివరించారు. విద్యార్థి దశ నుండి వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని, దీనికోసమే పాఠశాలల్లో ఈ నెల 8వ తారీకు వరకు వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ రహీం, అటవీ సెక్షన్ అధికారి మహేందర్, అటవీ బీట్ అధికారులు సాధిక్ పాషా, ప్రకాష్, వెంకటేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్