జన్నారం నుంచి కరీంనగర్ అనాథాశ్రమానికి నిజాముద్దీన్ తరలింపు
నవతెలంగాణ-జన్నారం
మానవసేవే మాధవసేవ అనే నానుడికి నిదర్శనంగా, ఆపన్నులకు అండగా నిలుస్తూ వీబీ (VB) ఫౌండేషన్ మానవత్వాన్ని చాటుకుంది. జన్నారం గ్రామానికి చెందిన ఎండీ నిజాముద్దీన్‌కు ఎవరూ లేరని, అనాథగా జీవిస్తున్నారని తెలుసుకున్న కరీంనగర్‌కు చెందిన వీబీ ఫౌండేషన్ నిర్వాహకులు ఆయనకు ఆశ్రయం కల్పించేందుకు ముందుకొచ్చారు.
ఈ క్రమంలో వీబీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీపెల్లి వీరమాధవ్ స్వయంగా జన్నారంకు వచ్చి నిజాముద్దీన్‌ను తమ ఆశ్రమానికి తీసుకెళ్లారు. జన్నారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజ్మీర నందునాయక్, మాజీ ఉపసర్పంచ్ జంగం రవి, ఎండీ కుత్బొద్దీన్, కొండాపురం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆపన్నులకు ఆశ్రయం కల్పిస్తూ, ఆదరణకు నోచుకోని వారికి అండగా నిలుస్తున్న వీబీ ఫౌండేషన్ సేవలను పలువురు అభినందించారు. నిజాముద్దీన్‌కు ఆశ్రయం కల్పించేందుకు ముందుకొచ్చిన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీపెల్లి వీరమాధవ్‌కు స్థానికులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.






కామెంట్‌లు (0)