నవతెలంగాణ - హైదరాబాద్ : విజయవాడ దుర్గమ్మను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం దర్శించుకోనున్నారు. రాత్రి 7.10 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకోనున్న రాష్ట్రపతి దుర్గమ్మ సన్నిధిలో అరగంటపాటు ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఆ అర్ధ గంట భక్తులకు దర్శనాలు నిలిపేస్తున్నట్లు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. క్యూలైన్లలో ఉన్నవారు ఎక్కడివారు అక్కడే ఉండాలని సూచించారు. రాష్ట్రపతి దర్శనం ముగిశాక యథావిధిగా దర్శనాలు ఉంటాయని తెలిపారు.
అరగంట దుర్గమ్మ దర్శనాలు నిలిపివేత: దేవదాయశాఖ కమిషనర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)