నవతెలంగాణ-టేకుమట్ల
మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి చేసిన కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో భూపాలపల్లి ప్రధాన న్యాయమూర్త జే జీవన్ కుమార్ నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3000/ జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారని ఎస్సై జి అమూల్య తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో మండలంలోని మందలోరిపల్లి గ్రామానికి చెందిన మూగ, చెవుడు గల మానసిక వికలాంగురాలు (40) మహిళ ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామస్తుడైన బండి శంకర్ (55) ఆమెపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు.
అయితే ఈ ఘటనను బాధితురాలి తల్లి చూడడంతో శంకర్ అక్కడి నుండి పారిపోయాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దార్యప్తు ప్రారంభించిన పోలీసులు నిందితునిపై సరైన సాక్షాధారాలతో కోర్టులో చార్జ్ షీట్ నమోదు చేశారు. కోర్టులో సరైన సాక్షాధారాలతో నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జే జీవన్ కుమార్ నిందితునికి 10 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3000/- జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించారు.
ఈ కేసులో నిందితునికి శిక్షపడేలా సమర్థవంతంగా పనిచేసిన అప్పటి దర్యాప్తు అధికారులను ప్రస్తుత భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు, ప్రస్తుత చిట్యాల సీఐ సతీష్, ఎస్సైఅమూల్యను భూపాలపల్లి జిల్లా ఎస్పి
సంకీర్త్ ప్రత్యేకంగా అభినందించారు.






కామెంట్‌లు (0)