Magazines

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటోంది: సబితా ఇంద్రారెడ్డి

1 గంట క్రితం

Sabita
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా అలైన్‌మెంట్ ఖరారు చేయని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆమె మండిపడ్డారు. 

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనను ప్రస్తావిస్తూ, బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదని, అలాంటప్పుడు బహదూర్‌గూడలో పోలీసుల రక్షణతో రైతుల భూములను ఎందుకు తీసుకున్నారని సబిత ప్రశ్నించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలను ప్రభుత్వం అనవసరంగా సేకరిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డికి ఇంత భూదాహం ఎందుకో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్