నవతెలం-గాణ - హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఎలక్ట్రిక్ గీజర్‌లో దాచి అక్రమంగా తరలిస్తున్న 7.750 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 2.71 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 12న బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణించిన ఓ భారతీయుడిని పోలీసులు అడ్డగించారు. అతని చెక్-ఇన్ బ్యాగేజీని తనిఖీ చేయగా, అందులో ఒక ఎలక్ట్రిక్ గీజర్ కనిపించింది. అనుమానంతో దాన్ని తెరిచి చూడగా, లోపల 73 ప్యాకెట్లలో పచ్చని పదార్థం బయటపడింది. నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షించగా, అది గంజాయి అని నిర్ధారణ అయింది. దీంతో అధికారులు వెంటనే సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. సరుకును మొత్తం సీజ్ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.





కామెంట్‌లు (0)