Magazines

జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

1 గంట క్రితం

Gyanesh Kumar
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

- ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి

- ఎన్నికల సంఘాన్ని సమూలంగా సంస్కరించాలి

- రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన

నవతెలంగాణ – అశ్వారావుపేట

ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ తప్పుడు పద్ధతులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బస్‌స్టాండ్‌ సెంటర్‌లో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.


ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అని పేర్కొన్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లు సమాన స్థాయి కలిగి ఉన్నప్పటికీ, ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించిన అంశాలపై జ్ఞానేశ్‌ కుమార్‌ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం నిరంకుశ చర్య అని విమర్శించారు. బీజేపీ తన రాజకీయ ఎజెండాలో భాగంగా మతాధారిత పౌరసత్వ బిల్లును అమలు చేసేందుకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను అడ్డదారిగా ఎంచుకుందని ఆరోపించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయడంతోపాటు ఎన్నికల సంఘాన్ని సమూలంగా సంస్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బుడితి చిరంజీవి, సీఐటీయూ మండల నాయకులు ఏసు, నాగేంద్ర, రమేష్‌, రాంబాబు, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్