Magazines

దేవీ నవరాత్రులు, బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే

46 నిమిషాల క్రితం

celebrations
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి పట్టణంలోని  జవహర్ నగర్, సింగరేణి కాలనీలలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా మండపాలలో అమ్మవారికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మలకు పూజలు చేసి, మహిళలతో కలసి ఆనందోత్సాహాల మధ్య కోలాటం ఆడారు. దేవీ నవరాత్రులు, బతుకమ్మ సంబరాలతో కాలనీలలో పండుగ వాతావరణం సంతరించుకుంది. ప్రజాప్రతినిధులు తమతో కలిసి వేడుకలు జరుపుకోవడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, స్థానిక మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్