ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకల నిరంజన్ గౌడ్
నవతెలంగాణ-మర్రిగూడ
గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకల నిరంజన్ గౌడ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన గీత కార్మికులకు లైసెన్సులు, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు.
సొసైటీలకు రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలని, గీతా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు. పెన్షన్ 5 వేలకు పెంచాలని, గీతా కార్మికుల ప్రమాద బీమా ప్రీమియం ని వెంటనే విడుదల చేయాలని,గీతా కార్మికులందరికీ సేఫ్టీ కిట్లు అందించాలని, ప్రభుత్వం ఎన్నికల్లో గీతా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కన్వీనర్ బుర్ర శేఖర్, కామ్రేడ్ సత్యం పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)